TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కామినేని ఆస్పత్రి వద్దకు చేరుకొని అతని పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సమస్యల వల్లే కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని సంచలనం చేయొద్దని రంగనాథ్ తెలిపారు.