మెరకముడిదాం మండలం గర్భాం పంచాయతీలో ఆదివారం ఎస్సై జె.లోకేష్ కుమార్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు వాహనానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రహదారి నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.