VZM: విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత, సమస్య పరిష్కార దృక్పథమే భవిష్యత్తు భారత టెక్నాలజీకి బలమైన పునాదిగా మారుతుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. డిజిటల్ సమ్మిట్ 2025లో భాగంగా ముంజేరు క్యాంపస్లో నిర్వహించిన ‘సిటిజెన్ హ్యాక్’ హ్యాకథాన్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ హ్యాకథాన్లో ప్రతిభ కనబరిచి, విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.