NLR: కోట మండలం శ్రీనివాససత్రం బీచ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి యుగంధర్ (20) అలల తాకిడికి గల్లంతై మృతి చెందాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన యుగంధర్, మద్యం సేవించి ఉన్నట్టు సమాచారం. మద్యం మత్తులో ఊపిరి ఆడక మృతి చెందినట్లు స్నేహితులు తెలిపారు.