ఉమ్మడి WGL జిల్లాలో కోతుల సమస్య పాలకుల తాత్కాలిక నిర్ణయాలకు నిదర్శనంగా మారింది. ఎన్నికల హామీల కోసం సర్పంచులు గ్రామాల్లో కోతులను పట్టించి పట్టణ శివార్లలో వదిలేశారు. దీంతో పట్టణాలు వానరావాసాలుగా మారి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సమస్యను ఒకచోట నుంచి మరోచోటికి మళ్లించడమే తప్ప శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.