కృష్ణా: నందిగామ పట్టణం 16వ వార్డు బీసీ న్యూ కాలనీ పరిధిలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పోలియో చుక్కల కేంద్రాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలను వేయించారు. పోలియో వంటి ప్రాణాంతక వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.