MBNR: జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేందుకు కేంద్రం కుట్రలు చేయడం మానుకోవాలి హెచ్చరించారు. ఆదివారం అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. పేదలకు ఉపాధి చూపించడమే ఈ పథకం లక్ష్యమన్నారు.