W.G: మరోసారి జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తన ధ్యేయమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇవాళ తణుకులో ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసి అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గుర్తించుకొని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు.