RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాయిరాం కాలనీలో కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పర్యటించారు. కాలనీలో కొంతమేర రోడ్డు నిర్మాణం చేపట్టాలని, సంక్షేమ సంఘం భవనం మొదటి అంతస్తు నిర్మాణానికి కృషి చేయాలని, భూగర్భ డ్రైనేజ్ పైపులైను ఏర్పాటు చేయాలని కార్పొరేటర్‌ను కోరారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.