VSP: సీతమ్మదారలోని ఆక్సిజన్ టవర్స్‌లో ఆదివారం ధ్యాన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఓం ఉచిత యోగా సంస్థ వ్యవస్థాపకుడు చిలకా వెంకటరమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మంచి ఆలోచన విధానం, ఆత్మవిశ్వాసం, సహనం, ఓర్పు పెరుగుతాయని తెలిపారు.