KMM: కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం పేరుపల్లిలో NSS కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలోని ప్రధాన రహదారుల మెంబడి చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ విజయ కుమారి ఆరోగ్యమే మహాభాగ్యం, స్త్రీల రక్తహీనత అనే అంశంపై అవగాహన కల్పించారు.