బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫీనాలే ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. అయితే విన్నర్ ప్రకటన రాకముందే వికీపీడియా సోషల్ మీడియాలో ఇచ్చిన అప్డేట్ హాట్ టాపిక్‌గా మారింది. విజేతగా కళ్యాణ్, రన్నర్‌గా తనూజ నిలిచారంటూ వికీపీడియాలో కనిపించింది. కాగా, వికీపీడియా ఎవరైనా సవరించగలిగే(ఓపెన్ సోర్స్) వేదిక కాబట్టి.. ఎవరో కావాలని ఈ మార్పులు చేసినట్లు టాక్.