SRCL: క్రీడలతో మానసిక ఉల్లాసం కలగడంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. తిప్పాపూర్ రెడ్డి కాలనీలో శాంతినగర్ ప్యారిస్ క్రికెట్ లీగ్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలకు ప్రభుత్వం ఎల్లవేళలా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు.