AP: అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ క్రమంలో భువనేశ్వరికి ఆదివాసీలు కొమ్ము నృత్యంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో రంపచోడవరంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.