CTR: పూతలపట్టు జడ్పి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. చిన్నారుల భవిష్యత్తుకు పోలియో చుక్కలు ఎంతో అవసరమని.. తప్పనిసరిగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లితండ్రులు మందు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో యువరాజుల నాయుడు, దొరబాబు చౌదరి పాల్గొన్నారు.