VZM: పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. ఆదివారం పూసపాటిరేగ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. 0 నుంచి 5 సంవత్సరాల వయసులోపు ఉన్న ప్రతి బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.