కోనసీమ: గతంలో ఎప్పుడూ లేని విధంగా 24 గంటల్లోనే రైతులకు సంపూర్ణంగా ధాన్యం సొమ్ములు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట నియోజకవర్గ లక్ష్యం 99,314 టన్నులు కాగా ఇప్పటికే 98,260 టన్నుల సేకరణ పూర్తయిందన్నారు. రైతులకు 232 కోట్లు చెల్లించి రాష్ట్రం లోనే మండపేట మొదటి స్థానం లో నిలవడం జరిగిందన్నారు.