W G: తాడేపల్లిగూడెం వైసీపీలో వర్గ విభేదాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, వడ్డీ రఘురాం నాయుడు, కొట్టు నాగేంద్ర వర్గాలుగా చీలినట్లు టాక్ నడుస్తోంది. ఆదివారం జగన్ పుట్టినరోజు వేడుకలను మూడు వర్గాలు వేర్వేరుగా నిర్వహించాయి. పార్టీలో వర్గపోరు తీవ్రమైందని, త్వరగా నియోజకవర్గ ఇంఛార్జ్‌ని నియమించాలని కార్యకర్తలు కోరుతున్నారు.