శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ అండతో కొందరు ఇసుక అక్రమ దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శివారు గ్రామాలను డంపింగ్ కేంద్రాలుగా మార్చి రాత్రి వేళల్లో భారీ లారీలతో ఒడిశా, హైదరాబాద్‌లకు ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల నదీ పరీవాహక ప్రాంతాలు కోతకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.