TG: తాము అధికారంలో ఉన్నప్పుడు అహంకార వైఖరి ప్రదర్శించలేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదు. తీసుకువచ్చిన పాలసీ రియల్ ఎస్టేట్ కోసమే. రాష్ట్ర ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను దగ్గరకు వచ్చేది. ఇప్పడు యూరియా కోసం కుటుంబమంతా లైన్లో ఉండే పరిస్థితి వచ్చింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.