T20 WCకు ఎంపికైన సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కేరళ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో సత్తా చాటి, భారత వన్డే జట్టులోనూ సుస్థిర స్థానం దక్కించుకోవాలని సంజూ భావిస్తున్నాడు. కాగా, ఇప్పటివరకు భారత్ తరఫున 16 వన్డేలు ఆడిన సంజూ.. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో 510 పరుగులు సాధించాడు.