SRCL: రాజీమార్గం ద్వారానే సత్వర న్యాయం లభిస్తుందని వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ అన్నారు. వేములవాడ కోర్టు ప్రాంగణంలో ఆదివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీ పడడానికి వీలున్న కేసులను లోక్ అదాలత్ సందర్భంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి పాల్గొన్నారు.