U19 ఆసియా కప్ ఫైనల్లో భారత్కు భారీ షాక్ తగిలింది. 341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 49 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. సూర్యవంశీ, ఆయూష్ మాత్రే కలిసి తొలి ఓవర్లోనే 21 పరుగులు రాబట్టి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో వైభవ్ (26), మాత్రే (2), ఆరోన్ జార్జ్ (16) ఔటయ్యారు. ప్రస్తుతం విహాన్, వేదాంత్ క్రీజులో ఉన్నారు.