ATP: గుమ్మఘట్ట మండలం భైరవాణి తిప్ప ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీడిపల్లి నుంచి కృష్ణా జలాలను బీటీపీ ప్రాజెక్టుకు తరలించే పనులు వేగంగా చురుగ్గా సాగుతున్నాయని వారు పేర్కొన్నారు. గుమ్మగట్ట మండల కన్వీనర్తో పాటు నేతలు పాల్గొన్నారు.