సత్యసాయి: మంత్రి సవితను జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన ఛైర్మన్ వడ్డే వెంకట్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రిని శాలువాతో సన్మానించి పూలగుచ్ఛం అందజేశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులకు అవసరమైన వసతుల కల్పనపై ఈ సందర్భంగా చర్చించారు.