KMM: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పేరును మార్చి జాతిపిత మహాత్మా గాంధీని అవమానించిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ అన్నారు. ఉపాధి హామీ పేరును మార్చడానికి నిరసిస్తూ ఆదివారం ఖమ్మం గాంధీ చౌక్‌లోని గాంధీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందన్నారు.