TG: వైద్య శాఖను సీఎం రేవంత్ రెడ్డి గాలికొదిలేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అలంపూర్ చౌరస్తాలో 100 పడకల ఆస్పత్రిని ఆమె పరిశీలించారు. ఆస్పత్రి నిర్మించి మూడేళ్లు గడిచినా వైద్య సేవలు ప్రజలకు అందించడంలో నాయకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ప్రజల తిరుగుబాటును గమనించిన తూతూ మంత్రంగా ఆస్పత్రిని ప్రారంభించారని పేర్కొన్నారు.