గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని 41వ డివిజన్ స్వర్ణభారతి నగర్, అడవితక్కెళ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి, రాష్ట్రాన్ని పోలియో రహితంగా మార్చుదామని ఆయన పిలుపునిచ్చారు.