BDK: MGNREGA పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఇల్లందు మండలం గోవింద్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ప్రసంగించారు. మహాత్మా గాంధీ పేరుతో తీసుకొచ్చిన పథకాన్ని మార్చడం ప్రజావ్యతిరేక నిర్ణయమని అన్నారు. పేదల ఉపాధి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.