మెన్స్ U19 ఆసియా కప్ ఫైనల్లో పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్(104*) సెంచరీ చేశాడు. 71 బంతుల్లోనే 4 సిక్సర్లు, 13 ఫోర్లతో 100 రన్స్ పూర్తి చేసుకున్నాడు. టోర్నీలో అతనికి ఇది రెండో సెంచరీ కాగా.. 29 ఓవర్లలో పాక్ స్కోర్ 193/2గా ఉంది. క్రీజులో మిన్హాస్తోపాటు అహ్మద్ హుసేన్(27) ఉన్నాడు. అటు భారత బౌలర్లలో హెనిల్, ఖిలన్ చెరో వికెట్ తీశారు.