NTR: నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో ఆదివారం నాడు చంద్రన్న సామూహిక గోకులం షెడ్‌ను ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ఈ సందర్భంగా షెడ్లో ఉన్న గేదలకు అందుతున్న పశుగ్రాసం, వాటి పోషణ విధానం, ఆరోగ్య సంరక్షణ చర్యలపై స్థానికులు మరియు సంబంధిత అధికారులను, వివరంగా అడిగి తెలుసుకున్నారు.