WGL: సంగెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రేపు ఉదయం 11 గంటలకు 9వ, 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీ అంశం ‘వినియోగదారుల చట్టం – హక్కులు, బాధ్యతలు, సమస్యల పరిష్కార మార్గాలు’గా నిర్ణయించారు. విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచడమే ఉద్దేశమని పేర్కొన్నారు.