DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘OG’. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా హిట్ అందుకుంది. గతంలో ఈ సినిమాకు సీక్వెల్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నిర్మాణం నుంచి DVV తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ నిర్మాణం బాధ్యతలను UV క్రియేషన్స్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.