PLD: నరసరావుపేటలో కొలువైన గంగమ్మ అంకమ్మ తల్లి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.