SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ వీరన్నగూడెంలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షుడు కావలి ఐలేష్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.