NRML: పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీలో సోమవారం విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ వర్షాలు, వరదల సమయంలో చేపట్టాల్సిన రక్షణ, సహాయక చర్యలను కృత్రిమంగా ప్రదర్శించారు. ప్రజల భాగస్వామ్యం, వివిధ శాఖల సమన్వయంతో రక్షణ, ప్రథమ చికిత్స, పునరావాస చర్యలు చేపట్టారు.