కృష్ణా: డిసెంబర్ 1 నుంచి గుడివాడ పరిపాలన సంఘపరిధిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్లాత్ సంచులను ఆయన అధికారులతో కలిసి ఇవాళ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న అనర్ధాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.