MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని పత్లావత్ పద్మావతిని ఉపకులపతి ఆచార్య శ్రీనివాస్ సోమవారం ఘనంగా అభినందించారు. త్వరలో ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని, చక్కని ప్రతిభ కనబర్చలన్నారు. యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆమెకు ఆర్థిక సహాయం అందించారు.