వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది.ఈ అదాలత్ ద్వారా మొత్తం 4,881కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పరిష్కరించిన కేసుల్లో ఎఫ్ఎఆర్, డ్రంకన్ అండ్ డ్రైవ్, మోటార్ వాహన చట్టం,సైబర్ కేసులు తదితరాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.