NZB: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం. నేటి నుంచి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు.