TG: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన BRSLP సమావేశం జరగనుంది. కాగా, సమావేశానికి ముందు కేసీఆర్ తన నందీనగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావుతో గంటపాటు కీలక చర్చలు జరిపారు. సమావేశంలో మాట్లాడాల్సిన అంశాలపై వారు లోతుగా సమాలోచించినట్లు సమాచారం.