ADB: నార్నూర్ మేజర్ గ్రామపంచాయతీని ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తామని నూతన సర్పంచి బానోత్ కావేరి అన్నారు. ఆదివారం ఆదివాసీ నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హమిచ్చారు. ఈ కార్యక్రమంలో బానోత్ మాజీ సర్పంచి గజానంద్ నాయక్, వార్డు సభ్యుడు కొర్రెల మహేందర్ తదితరులున్నారు.