AP: ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పేద, గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. కేంద్రం కుట్రలో సీఎం చంద్రబాబుకూ భాగం ఉందన్నారు. పేదలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఉపాధి హామీపై కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించరా అని నిలదీశారు.