JN: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జనగామ పట్టణ కేంద్రంలోని ధర్మకంచ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కుక్-కమ్-హెల్పర్స్ వంటల పోటీలను ఆదివారం నిర్వహించారు. వివిధ పాఠశాలల నుండి కుక్-కమ్-హెల్పర్స్ హాజరై చేసిన వంటకాలు బాగున్నాయి అని అన్నారు. విద్యార్థులే రుచి చూసి విజేతలను ఎంపిక చేశారు. లక్ష్మి ప్రథమ, సుజాత ద్వితీయ, హాసియ తృతీయ స్థానాలు సాధించారు.