TG: MLA సంజయ్ కుమార్‌పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నడ మంత్రపులో వచ్చి బెదిరించే వాళ్ళు మోపయ్యారు. నా వద్దకు రాకుంటే మీరు చేసిన పనులకు బిల్లులు రావు, పనులు మంజూరు కావు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. పంచాయితీలకు నిధులు నేరుగా ఢిల్లీ నుంచే వస్తాయి. ఎవరిదగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెద్దరికం చేస్తున్నాడు’ అని మండిపడ్డారు.