MLG: మేడారం మహా జాతర-2026 పోస్టర్‌ను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి సీతక్క సీఎంకు వనదేవతల పసుపు బండారి బొట్టు పెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరుగుతుంది.