గుంటూరు నగరంలోని 24వ డివిజన్ ఎస్పీ బంగ్లా ఎదురు ప్రాంతంలో రూ. 4.50 కోట్ల వ్యయంతో 1600 కిలో లీటర్ల సామర్థ్యం గల ఇఎల్ఎస్ఆర్ (ఓవర్హెడ్ ట్యాంక్) నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు నిరంతరంగా శుద్ధి చేసిన మంచినీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.