AP: మాజీ సీఎం జగన్ జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు.. అటు మంత్రి లోకేష్ ‘జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంతో కలకాలం జీవించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.