విశాఖ: మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు (చందు) ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అలాగే పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నాయకురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.