KKD: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. శనివారం ఆమె తుని ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరాల దృష్ట్యా ఆసుపత్రిలో ప్రత్యేకంగా థైరాయిడ్ కేంద్రాన్ని తీసుకువస్తామన్నారు.